"బొమ్మరిల్లు", చిత్రం ద్వారా హాసినిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ జెనీలియా.
అమాయకపు మోముతో చిలిపి అమ్మాయిగా అందరినీ ఆకర్షించిన ఈ భామ, ఈ మధ్య వైవిధ్య పాత్రలను పోషించాలని నిర్ణయించినట్లు సమాచారం.
బాలీవుడ్‌లోనూ సూపర్ ఛాన్సులు కొట్టేస్తున్న జెన్నీ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విభిన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది.
బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్ చిత్రాలకు ముఖ్యత్వం ఇస్తోన్న ఈ శశిరేఖ, ఇకపై ఆడియన్స్ ఆదరణ కోసం సీరియస్ పాత్రలు పోషించేందుకైనా సిద్ధంగా ఉందని ఫిలిమ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో జెన్నీ కాల్షీట్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారట. అంతేకాదు.. రోజువారిగా మంచి కథ చెబుతామని జెన్నీ వద్దకు వచ్చి వెళ్లే రచయితలు ఎక్కువవుతున్నారని తెలిసింది.
అయితే జెన్నీ మాత్రం డిఫరెంట్ రోల్ అయితే ఓకే.. లేదంటే గో.. గో.. అంటూ చెప్పేస్తుందట..! ఇంకేముంది..? హాసినిగా గుర్తింపు సంపాదించిన ఈ శశిరేఖకు మంచి కథ దొరుకుతుందో? లేదో? వేచి చూడాల్సిందే..!