1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. dream Boy

Shriya| dream Boy| Pista| Vishal| Istam | నా డ్రీమ్‌బాయ్ ఇంకా కంటపడలేదు..!: శ్రియ

శ్రియ
"ఇష్టం" సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న సెక్సీడాళ్ శ్రియ. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తున్న శ్రియ, తాజాగా ఆరడుగుల అందగాడు విశాల్‌తో "పిస్తా" అనే సినిమాలో నటించింది. 

ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో బిజీ బిజీగా ఉన్న శ్రియను కదిలిస్తే.. కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. పిస్తాలో తన నటనను చూసి అందరూ మెచ్చుకున్నారని చెప్పింది.

పెళ్లెప్పుడు తల్లీ.. అని శ్రియను అడిగితే..? ఇంకేముంది..? "నా డ్రీమ్ బాయ్ ఇంక కంటపడలేదని" అంటోంది. అంతేకాదు.. తనకు కాబోయే భర్తకు కొన్ని క్వాలిటీస్ ఉండాలని వెల్లడించింది.

అవి ఏమిటంటే..? జీవితంలో తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలట. దీంతో పాటు బాగా చదువుకున్న వ్యక్తిగా బుద్ధిమంతుడిగా ఉండాలట. అందరిలా కాకుండా తన డ్రీమ్‌బాయ్‌కి విశేషమైన క్వాలిటీస్ ఉండాలని శ్రియ వరుసగా చెప్పుకొచ్చింది.

ఇంకేముంది..? శ్రియ ఎదురుచూసే స్పెషల్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి తప్పకుండా సినీ ఇండస్ట్రీలో లేడని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. సో.. శ్రియ ఇక ఫిలిమ్ సర్క్యూట్‌ను వదిలిపెట్టి వేరే రంగంలో తన డ్రీమ్ బాయ్‌ని వెతుక్కోవల్సిందేనని వారు అంటున్నారు. మొత్తానికి శ్రియకు తగిన మొనగాడు దొరకాలని ఆశిస్తూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..!