Tamannah, flu, Director, Actor, | ఫ్లూ జ్వరంతో వణికిపోయిన తెల్లపిల్ల తమన్నా
|
దీంతో వీళ్లద్దరికీ ఫ్లూ జ్వరం వచ్చిందన్న సంగతిని చిత్ర నిర్మాతకు చెబుదామంటే, ఆయన అందుబాటులో లేరట. చేసేది లేక కనీసం చిత్ర కథానాయకునికైనా చెబుదామని పరుగెత్తారట. చిత్రంగా సదరు హీరోగారు కూడా ఓ ఐదు మందపాటి రగ్గులు కప్పుకుని "హు...హు.. హు..." అని మూలుగుతున్నాడట. అంతే... ఆయనకు కూడా ఫ్లూ జ్వరం వచ్చినట్లు నిర్థారించుకున్నారట అసిస్టెంట్లు.
చివరికి ఎలాగోలా చిత్ర నిర్మాతను వెదికి పట్టుకుని హీరోహీరోయిన్లతోపాటు దర్శకుడు ఫ్లూ జ్వరంతో వణికిపోతున్నారని చెప్పారట. చిత్ర నిర్మాత వెంటనే వైద్యుడిని పిలిపించి ఫ్లూ తగ్గేందుకు మందులు వాడారట.
పవర్‌ఫుల్ మందులు కావడంతో ముగ్గురికీ ఫ్లూ తగ్గిపోయిందట. తగ్గింది సరే... అసలు ఈ ఫ్లూ జ్వరం ముందు ఎవరికి వచ్చింది... ఆ తర్వాత ఎవరి ద్వారా మరొకరికి వ్యాపించిందోనని అసిస్టెంట్లు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారట. పాడు ఫ్లూ జ్వరం... ఒక్కరితో వదిలిపెట్టదు కదా...
