1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Arundhati

Anushka| Arundhati| Bommali| Mahesh Babu| Billa | స్క్రిప్ట్‌ విషయంలో జాగ్రత్త పడుతోన్న బొమ్మాళీ!

స్క్రిప్ట్
WD
"అరుంధతి" హిట్టయిన తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులతో బొమ్మాళీ అని పిలువబడే సెక్సీడాళ్ అనుష్క ఈ మధ్య కథను ఎంచుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుందట.

అరుంధతి చిత్రం ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ బిల్లా సుందరి తదుపరి చిత్రంలో నటించేందుకు కాస్త ఆచీ తూచీ వ్యవహరిస్తోందట.

బిల్లాలో సెక్సీ సుందరిగా, అరుంధతిలో ప్రజలనకు కాపాడే రాణిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చిన అనుష్క, తన తదుపరి సినిమా స్క్రిప్ట్ కోసం వెతుకులాట ప్రారంభించిందని సినీ వర్గాల సమాచారం.

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేషే బాబు సరసన పేరు ఖరారు కాని కొత్త చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉంటోన్న అనుష్కకు ఛాన్సులు వెల్లువల్లా వస్తున్నాయి.

ప్రసిద్ధి చెందిన బేనర్‌లపై నిర్మించబోయే నూతన సినిమాల్లో కూడా ఈ బొమ్మాళీకి అవకాశాలు వస్తున్నట్లు తెలిసింది. అయితే అరుంధతి మాత్రం స్క్రిప్ట్ విషయంలో కాస్త జాగ్రత్తపడి, తదుపరి సక్సెస్ చిత్రం కోసం కసరత్తు చేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం.
About Writer
SELVI.M