గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ఇంట్లో ఫైట్స్ చేస్తున్న "సివంగి" పిల్ల అర్చన (Sivangi | Archana | Tollywood | pub)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
సాంప్రదాయ కుటుంబాన్నుంచి ఇండస్ట్రీకి వచ్చిన నటి వేద. శ్రీరామదాసులో సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును అర్చనగా (మూడక్షరాలు) మార్చుకుంది.

ఆమె బంధువుల్లో ఐఏఎస్ అధికారులు ఎక్కువ. కానీ ఆ రూటులో వెళ్ళకుండా ఇండస్ట్రీవైపు మొగ్గి ఎవరిమాటా వినకుండా తనమాటే నెగ్గించుకుంది. జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన చిత్రం "బ్యాంక్" మూడు భాషల్లో విడుదలైనా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

ఇదిలా ఉంటే ఇటీవల తరచూ పబ్‌లలో ప్రతక్ష్యమవుతూ అందరినీ ఆశ్చర్యపరిచిందికూడా. ఎవరైనా పబ్‌లకు వెళుతున్నారటగా అని అడిగితే, పబ్‌కెళితే తప్పా? అనికూడా ప్రశ్నించింది. మనసు నిర్మలంగా ఉంటే ఎక్కడికెళ్ళినా తప్పులేదని చెబుతోంది.

తాజాగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్న 'సివంగి' ప్రారంభమైంది. దానికి కాప్షన్‌గా 'ఎవరిమాట వినదు' అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. అది కూడా ఒకే ఒక్క బేనర్‌లో పెట్టారు. అదేమని అడిగితే... రెండు పాత్రల్లో ఒక పాత్ర తన రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉంటుందని చెబుతూ... "నేను ఎవరిమాట వినను. అందుకే ఈ ఫీల్డులోకి వచ్చా"నంటూ తేల్చిచెప్పింది.

తనకు నచ్చిందే చేస్తాననీ.. ఎవరో ఏదో అనుకుంటారని బెదిరేదిలేదని చెపుతూ... "ఈ సినిమాలో నేను ఫైట్లు కూడా చేయాలి. ఈ కథ విని ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను. సినిమాలో నా ఫైట్స్ బాగా రావాలని ఇంట్లో కూడా ప్రాక్టీసు చేస్తున్నా. నన్ను చూసి మా ఇంట్లో బెదిరిపోతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా... ఇప్పుడు నేను ఇంట్లో గెలిచా... ఇక 'సివంగి'లా వచ్చి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటా" అంటోంది ఈ సివంగి పిల్ల
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వేద, న్యూమరాలజీ, అర్చన, సివంగి, పబ్, జాకీష్రాఫ్