Aishwarya Rai | aunty | Sonam kapoor | Cannes Film Festival | ఐశ్వర్యారాయ్ ఆంటీ.. నెంబర్ వన్నా..!? ఓ.. షిట్!!
ఆంటీ ఐశ్వర్యారాయ్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో నేటికీ హవా కొనసాగిస్తోంది కదా. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఐష్ పొజిషన్ టీనేజ్ హీరోయిన్ల మధ్య లేనే లేదని అంటోంది.తన తండ్రి అనిల్ కపూర్‌తో నటించిన ఐష్ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆంటీ అయిపోయిందని తన అక్కసును ప్రదర్శిస్తోంది. ఐష్‌పై సోనమ్ కపూర్‌కి ఎందుకంత కోపం..? అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటయా... అంటే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో సోనమ్ కపూర్‌ను రెడ్ కార్పెట్‌పై నడవనీయకుండా ఐష్ అడ్డుకున్నదట. అందువల్లే సోనమ్ ఇలా పగ తీర్చుకుంటోందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు.
టీనేజ్ ముద్దుగుమ్మ సోనమ్
సోనమ్ తనను ఆంటీగా పేర్కొనడంపట్ల ఐశ్వర్యారాయ్ ఇంతవరకూ పెదవి విప్పలేదు. సోనమ్ కపూర్ మాత్రం ఐశ్వర్యారాయ్ గురించి చెప్పాల్సిన సందర్భం వస్తే "ఐష్ ఆంటీజీ" అని అవసరం లేకపోయినా పదేపదే అంటోందట. మరి బాలీవుడ్ సినీపరిశ్రమ కూడా ఐష్‌ను ఆంటీ అనేస్తుందా...?
