1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. dating

rahul | dating | ashashiny | mayuri | balakrishna | narasimha naidu | cinema | venditera | | రాహుల్‌ గాంధీతో డేటింగ్‌కు సై: లక్స్ పాప

రాహుల్
FileFILE
"లక్స్‌ పాప.. లక్స్ పాప..లంచ్ కొస్తావా" అనే ఈ పాట యువరత్న బాలకృష్ణ నటించిన "నరసింహ నాయుడు" చిత్రంలోనిది. ఈ పాటలో బాలకృష్ణ సరసన నర్తించిన ముద్దుగుమ్మ పేరు ఆశాషైనీ. ఈ పాటలో తన అందచందాలను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ.. ఇటీవలే తన పేరును 'మయూరి'గా మార్చుకుంది. ఇప్పటి వరకు సమారు 30 చిత్రాల్లో నటించిన ఈ సెక్సీగర్ల్.. డేటింగ్ గురించి తన మనస్సులోని అభిప్రాయాలను నిక్కచ్చిగా వెలిబుచ్చింది.

డేటింగ్ చేయడం వల్ల యువతీ యువకుల్లో ప్రేమ బంధం బాగా బలపడుతుందట. ముఖ్యంగా, ఒక ఇంటివారు కావాలనుకునే యువతీ యువకుల మధ్య ఇది ఎంతో అవగాహన పెంచుతుందని చెపుతోంది. ప్రస్తుత జనరేషన్ చాలా సాఫ్ట్‌గా ఆలోచిస్తోందనీ, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన యువతీ యువకుల్లో లేదనీ, అందువల్ల భార్యా భర్తలు కావాలనుకునే వారు ముందుగానే డేటింగ్‌లో పాల్గొనడం తప్పులేదని మయూరి అంటోంది.

అయితే తనకు డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం తన ఛాయిస్ కాంగ్రెస్ యువరాజు రాహుల్‌ గాంధీయేనట. అదే నిజమైతే అంతకంటే భాగ్యం మరొకటి లభిస్తుందా, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు ఈ లక్స్ పాప చెపుతోంది. ఇకపోతే.. సినిమాల్లో బికినీ ధరించి నటించడాన్ని తాను అన్ని వేళలా సిద్ధం అంటోంది. తను నటించిన 30 సినిమాల్లో 90 శాతం మేరకు గ్లామర్ పాత్రలే అంటోంది. కథను బట్టి ఎలాంటి పాత్రలో నటించడానికైనా, బికినీ, టూపీస్ దుస్తులు వేయడానికైనా సిద్ధమేనని చెపుతోంది.
About Writer
PNR