Sreesanth | Minissha lamba | night club | IIFA | మినిస్సాతో శ్రీశాంత్ ప్రేమ "బంతులాట"
బాలీవుడ్ తారామణులకు భారత జట్టులోని పలువురు క్రీడాకారులకు మధ్య సన్నిత సంబంధాలున్నట్లు పలుసార్లు రుజువైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి బౌలర్ శ్రీశాంత్, సెక్సీ క్వీన్ మినిస్సా లాంబా చేరిపోయారు.
వీళ్లద్దరూ మకౌలోని కేసినో రెస్టారెంట్లోని నైట్‌క్లబ్‌లో సుమారు ఒక గంటపాటు సన్నిహితంగా గడిపినట్లు సమాచారం. ఒకే హోటల్‌లో గదులను అద్దెకు తీసుకుని విడవకుండా అవకాశం వచ్చినప్పుడల్లా కాలక్షేపం చేశారట.
అంతేకాదు ఐఐఎఫ్ఎ ఫెస్టివల్‌కి హాజరయ్యేందుకు ఇద్దరూ కలిసి వెళ్లారట. అలాగే వచ్చేటపుడు కూడా కలిసే వచ్చారట. మొత్తమ్మీద వారిద్దరి మధ్య విడదీయలేని బంధం మొగ్గ తొడిగిందంటున్నారు వారి వ్యవహార శైలిని చూసిన జనం.
అన్నట్లు, మినిస్సాకు నటుడు సుహెయిల్ రాథోడ్ లింకు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక శ్రీశాంత్ విషయానికి వస్తే.. ఈ బౌలర్ దక్షిణాది నటి లక్ష్మీరాయ్, హాటెస్ట్ నటి డెయిసీని క్లీన్ బౌల్డ్ చేశాడనే వార్తలున్నాయి. ఇక మినిస్సా, శ్రీశాంత్‌ల మధ్య ఉన్నది ఏ బంధమో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
