1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. BoyFriend

Saloni| BoyFriend| Sumanth| Dhana 51| Gossips| Yoga | మంచి బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నా..!

సలోని
తాను నటి కాకుంటే ఎయిర్‌ హౌస్టెస్‌ లేదా లాయర్‌గా అవ్వాలన్నదే తన లక్ష్యమని అంటోన్న నటి సలోని సుమంత్‌ నటించిన 'ధన 51'లో కథానాయికగా పరిచయమయింది. 

తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 12 చిత్రాల్లో నటించిన ఆమె గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చింది.

ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అందులో ప్రేమపెళ్ళి గురించి ఆమె మాట్లాడుతూ... ఇంకా ప్రేమలో పడలేదు. పడాక ఆలోచిస్తా. మంచి బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.

గాసిప్స్‌ని సీరియర్‌గా తీసుకోననని, తన మీద గాసిప్స్‌ వస్తే.. "గా..సిప్‌.."గానే ఫీలవుతానని తెలిపింది. తనకు చాకలెట్లు చాలా ఇష్టమని... ఎక్కడ కనబడ్డా ఆగి కొనుక్కుని తింటానని అంటోంది. ఆరోగ్యం గురించి చెబుతూ.. రోజూ యోగా చేస్తాననీ, మితాహారం తీసుకుంటానని వివరించింది.