Shriya Saran | soft drink ads | mother | boy | Mahesh | Ramcharan | ఇక నా పెదవులు వాటిని తాకవు: శ్రేయ
దక్షిణాది సెక్సీ తార శ్రేయా చరణ్ సాఫ్ట్ డ్రింక్ ప్రకటనల్లో నటించనని భీష్మించుక కూచుంది. పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తామనీ, మా సాఫ్ట్ డ్రింకులను మీరు తాగుతూ నటించినట్లుగా మరెవరూ నటించలేరనీ పొగడ్తలతో ముంచెత్తినా... శ్రేయ మాత్రం కుదరదంటోందట. "అందుకు కారణం ఏమిటి మిస్" అని మన పిల్ల జర్నలిస్ట్ అడిగితే ఈ విషయాలు ఆమె సన్నిహితులు చెప్పారట.
గతంలో శ్రేయ కొన్ని సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చేసిందట. ఒకరోజు ఓ తల్లి శ్రేయ వద్దకు వచ్చి... 'మా అబ్బాయికి మీరంటే ఎంతో అభిమానం. మీరు సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నట్లుగా నటించిన దగ్గర్నుంచీ, మా అబ్బాయి తిండి తగ్గించి అదేపనిగా మీరు తాగిన డ్రింక్స్‌నే అతిగా తాగేస్తున్నాడు' అని చెప్పిందట.
అంతే! ఇక సాఫ్ట్ డ్రింక్ ప్రకటనల్లో ఎట్టి పరిస్థితుల్లో నటించకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నదట శ్రేయ. అదిసరే ఇదే విషయాన్ని మన మహేష్ బాబుకు, రామ్ చరణ్‌కు చెబితే బాగుంటుదిగా. శ్రేయకు వాళ్లిద్దరూ సాఫ్ట్ డ్రింక్ ప్రకటనల్లో నటిస్తున్నట్లు తెలుసో? లేదో?. ఈసారి మన పిల్ల జర్నలిస్టుకు కనబడితే చెప్పమందాం. మరి మీరేమంటారూ...?