hobby | cinema | bollywood | kangana ranowtt | bathtob | raj-2 | boyfriend | adhyayan | | నగ్నంగా నటించేందుకు సిద్ధం: కంగనా రనౌత్
తనకు సినీ వృత్తిపై ఎంతో మక్కువ. నిబ్ధత ఉన్న నటిని. సన్నివేశానికి తగినట్టుగా నగ్నంగా నటించాల్సిన అవసరం వస్తే అందుకు సిద్ధమే అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జంకు బొంకులేకుండా చెపుతోంది. ఆమె తాజాగా నటిస్తున్న "రాజ్-2" చిత్రంలో బాత్‌టబ్ నుంచి నగ్నంగా దూకే సన్నివేశం ఉంది.
దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ సన్నివేశంలో నేను బాడీ సూట్ వేసుకుని నటించాను. ఇలాంటి తరహా సన్నివేశాన్నే దక్షిణాది చిత్రంలో కూడా చేస్తున్నాను. ఈ చిత్రం ప్రస్తుతం అండర్ షూటింగ్‌లో ఉంది. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలో సహజత్వం కోసం వలువలు తీయాల్సి వస్తే తప్పకుండా చేస్తాను. ఆ సన్నివేశంలో అశ్లీలత ఉంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం చెపుతాను అని అంటోంది.
తన బాయ్‌ఫ్రెండ్ అధ్యాయన్ గురించి ప్రస్తావిస్తే మాత్రం ఒంటికాలిపై పైకి దూకుతోంది. మేమిద్దరం విడిపోయినట్టు వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టే. పరిశ్రమలో ఇద్దరం బిజీగా ఉండటం వల్ల కలుసుకోలేక పోతున్నాం అని ముక్కుసూటిగా చెపుతోంది ఈ బాలీవుడ్ భామ.
