1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Katrina kaif

John Abraham | Katrina kaif | bed | passionate kiss | జాన్ అబ్రహాం బెడ్‌పై కత్రినా: సల్మాన్ కుతకుత

కత్రినాకైఫ్
IFM
కత్రినా సల్మాన్‌కు దూరంగా జరగడమే కాదు, తన చేష్టలతో అతడిని కుతకుతలాడిస్తోంది. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంతో కలిసి ఒకే బెడ్‌పై పడుకోవడమేకాక అతనికి మహా మత్తైన ముద్దు ఇచ్చిందట కైఫ్. ఈ ముద్దు సన్నివేశం న్యూయార్క్ చిత్రంలోనిదైనప్పటికీ రిహార్సిల్స్ అంటూ అబ్రహాం కత్రినా పెదవులపై అదేపనిగా అలసిపోయేంతవరకూ చుంబించాడట.

ఇదిలావుంటే సల్మాన్‌కు మరింత చిర్రెత్తించే మరో విషయం అతని ముందు నాట్యమాడుతోందట. అదేంటయా... అంటే, అబ్రహాం- కైఫ్‌ల ముద్దు సన్నివేశం తాలూకు ఉన్న ట్రైలర్‌నే అంతటా చిత్ర దర్శక నిర్మాతలు పంచారట. దీంతో టీవీల్లోనూ, వెబ్ సైట్లలోనూ, పేపర్లలోనూ ఎక్కడ చూసినా కత్రినా- అబ్రహాంల ఘాటైన ముద్దు సన్నివేశం కనబడుతోందట. వీటిని చూసిన సల్మాన్ కాగిపోతున్నాడట.

కత్రినా మాత్రం అందరు చెప్పే అరిగిపోయిన డైలాగు... " సన్నివేశానుసారం ముద్దిచ్చినట్లు నటించాను" అంటోందట. ఈ మాటలు విన్న తర్వాత సల్మాన్ కుతకుతల స్థాయి మరింత పెరిగిపోయిందట.

వాళ్లిద్దరి ఘాటైన ముద్దు సన్నివేశాన్ని భరించలేని సల్మాన్ ఏం చేస్తాడో... ఏమిటో..? అని అతని సన్నిహితులు గిలగిల కొట్టుకుంటున్నారట. ఎవరెట్లా కొట్టుకు చస్తున్నా కత్రినా మాత్రం తన పుట్టినరోజుకు చప్పట్లు కొట్టించుకునేందుకు రెడీ అవుతోందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT