1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. good kisser

Akshay Kumar | good kisser | Vishal | Sriya | hot kiss | ఆ హీరో భలే "ముద్దు"గాడట

బాలీవుడ్
బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల పెదవుల బిగింపులు సర్వసాధారణమే. ఆ ముద్దుల శృంగారం ముదిరేటపుడు "సీన్"ను సింక్ చేసేవారు ఒకప్పుడు. అయితే శరీర రాపిడిలను మాత్రం చాలా స్పష్టంగా తెరపైకి ఎక్కించేవారు. ఇప్పుడు ఆ శరీర రాపిడులతోపాటు నాయకానాయికల పెదవుల బిగింపును మరింత దగ్గరగా, స్పష్టంగా చూపించడం ట్రెండ్‌గా మారింది. ఈ వేడి ముద్దులను వెండితెరపై ప్రదర్శించే సంగతిని అలా ఉంచితే... ఏ హీరో చుంబన భలేగా ఉంటుందో విడమర్చి చెపుతున్నారు కొందరు బాలీవుడ్ సెక్సీతారలు.

ముఖ్యంగా కత్రినా, జాన్ అబ్రహాం నటించిన "న్యూయార్క్" చిత్రంలో అబ్రహాం ఇచ్చిన ముద్దు కుర్రకారులో శృంగారపు ఆలోచనలను శిఖరానికి చేరుస్తుందట. అందుకేనేమో, ఆ ముద్దు సన్నివేశంపై సల్మాన్ గిలగిల కొట్టుకుంటున్నాడు. అదలా ఉంచితే అంతకుముందు హృతిక్ రోషన్ నటించిన ఓ చిత్రంలోనూ ముద్దుపాలు ఎక్కువై ఒలికిపోయిందట. హృతిక్ ముద్దు "మధురం"తో ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ మైకంలోకి వెళ్లి కాసేపటి తర్వాత తేరుకుందట.

బాలీవుడ్ ముద్దులేనా అనుకునేరు... మన టాలీవుడ్ సైతం తమ ముద్దు "ఘాటు"ను రుచి చూపించే పనిలోనే ఉన్నది. ఇటీవల శ్రేయ, విశాల్ నటించిన "పిస్తా" చిత్రంలో ఇరువురు పెదవులు కాసేపు ముద్దాడుకోవడాన్ని చాలా దగ్గరగా చూపించారు. మరీ ఇంత "మోటు" ముద్దులున్న చిత్రాలు ఏ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయన్న సంగతిని ప్రక్కనపెడితే... అసలు మంచిముద్దుగాడైన హీరో ఎవరబ్బా అని బాలీవుడ్ సినీజనం తన్నుకుంటున్నారట.

సమాధానం దొరక్కపోవడంతో చివరికి ఆయా హీరోల "ముద్దు" రుచులను చూసిన కొంతమంది హీరోయిన్లను కదిలించారట. వాళ్లంతా "అక్షయ్ కుమార్ ముద్దు భలే... భలేభలే" అన్నారట. మరి మన టాలీవుడ్‌లో ముద్దు రుచులను చూసిన హీరోయిన్లు ఎవరి పేరు చెపుతారో... ఎవరిని "భళారే" అంటారో... చూద్దాం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT