1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. John Abraham

Katrina Kaif | John Abraham | hot relation | New York | వాళ్లిద్దరి మధ్య వేడి వేడి సంబంధం కుదిరిందట

న్యూయార్క్
IFM
"న్యూయార్క్" చిత్రం ఇంకా వెలుపలికి రాలేదు. కానీ ఆ చిత్రంలో నటించిన కత్రినా కైఫ్, జాన్ అబ్రహాంల సంబంధం గురించి బాలీవుడ్ సినీజనం తెగ చర్చించుకుంటున్నారు. జాన్, కత్రినాల మధ్య వేడి వేడి స్నేహ సంబంధం కుదిరినట్లు గుసగుసలు పోతున్నారు.

దీనికి బలాన్ని చేకూర్చే సంఘటన కూడా జరిగిందని వారు వాదిస్తున్నారు. న్యూయార్క్ చిత్రంలో కత్రినా కైఫ్, జాన్ అబ్రహాంల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉన్నదట. ఈ "ముద్దు" చిత్రీకరణలో ముద్దు సరిగా రాక రెండు మూడుసార్లు చిత్రీకరించాల్సి వచ్చిందట. ఇటువంటి సందర్భాల్లో హీరోయిన్లు మళ్లీ మళ్లీ ముద్దంటే ఒప్పుకోరు. అయితే కత్రినా కైఫ్ మాత్రం ఎన్నిసార్లు ముద్దివ్వమన్నా అలా ఇస్తూనే ఉన్నదట.

ఈ పరిణామాన్ని చూసిన యూనిట్ సభ్యులు కొందరు విస్తుపోయారట. పైగా ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిపోయినా జాన్ అబ్రహాం మాత్రం కత్రినా చుట్టూనే తిరుగుతున్నాడట. కత్రినా కూడా జాన్ ఎక్కడికి రమ్మంటే అక్కడి వెళుతోందట. వీళ్లద్దరి వ్యవహారం చూస్తుంటే... ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా ఉందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఈ సంగతి సల్మాన్ ఖాన్‌కు తెలుసో లేదో మరి!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT