1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Magadheera

Ramcharan Teja | Magadheera | Rajamouli | Chiranjeevi | "మగధీర" "మగమహారాజు" అంతటివాడవుతాడా...?

మెగాస్టార్
WD
మెగాస్టార్ పుత్రరత్నం రామ్ చరణ్ తేజ "చిరుత" తర్వాత "మగధీర"గా రాబోతున్నాడు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళి ఈ మగధీరను తీర్చిదిద్దుతున్నాడు.

చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. గ్లామర్ నటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమెకు 'మగధీర' ప్లస్ అవుతుందో, 'మగధీర'కు ఆమే ప్లస్ అవుతుందో చిత్రం వచ్చాక కాని తెలియదు. రియల్‌స్టార్ శ్రీహరి నటించడం ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్లస్ పాయింటే అవుతుందంటున్నారు తెలుగు సినీ పండితులు.

అన్నట్లు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను 400 ఏళ్లకు ముందు జరిగిన సంఘటనల ఆధారం చేసుకుని చిత్రీకరించారట. ఇక ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి శ్రావ్యమైన సంగీతాన్ని అందించారంటున్నారు. మగధీరునికి తగ్గట్లు ఫైట్లు, ఫీట్లు ఉంటాయని దర్శకుడు రాజమౌళి చెపుతున్నారు. వెరసి చిత్ర బడ్జెట్ ఇప్పటికే 30 కోట్ల రూపాయలను తాకిందట.

చిత్రం పూర్తయ్యేనాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. బడ్జెట్ బాగా బరువుగానే ఉన్నది. మరి "మగధీరుడు" ఈ చిత్రంతో "మగమహారాజు" అంతటివాడవుతాడా...? అనే ప్రశ్నకు వెండితెరపై మగధీరుడు సమాధానం చెప్పేవరకూ వేచి చూడాల్సిందే.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT