Ishwarya rai | bollywood | Robo | pregnent | | ఐష్ కోరిక.. ఇప్పట్లో తీరదేమో!
|
అయితే, అభిషేక్-ఐశ్వర్య దంపతులు మాత్రం వచ్చే ఏడాది ఒక కుటుంబీకులు కావాలన్న ఆలోచనలో ఉన్నట్టు బాలీవుడ్ చిత్రసీమ మాత్రం కోడై కూస్తోంది. వీటికి తోడు ఈ దంపతులు మౌనం వహిస్తుండడం, ఐశ్వర్యకు ఇప్పట్లో సినిమాలను వదలిపెట్టే ఆలోచనలేకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత రెక్కలు వచ్చాయి.
ప్రస్తుతం ఐష్.. శంకర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘రోబో’, మణిరత్నం తీస్తున్న "రావణ్", సంజయ్ లీలా బన్సాలీ నిర్మించే "గుజ్జారిష్" తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలు పూర్తయిన మరుక్షణమే ఆమెతో చిత్రాలు తీసేందుకు మరికొంతమంది నిర్మాతలు క్యూలో ఉన్నారు.
ఈ జాబితాలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. రోహాన్ సిప్పీ, విశాల్ భరద్వాజ్, రితూపర్ణ ఘోష్, అశుతోష్ గోవారికర్ తదితరులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సినిమాల వైపు మొగ్గు చూపిన పక్షంలో ఐష్ తల్లి అయ్యేందుకు మరికొన్ని సంవత్సరాలు వేచి చూడక తప్పదు.
