1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sradha Doss

Marshal Arts| Sradha Doss| 18, 20 Love Story| Glamour| Saree | "మార్షల్‌ ఆర్ట్స్‌" నేర్చుకోమంటున్న శ్రద్ధాదాస్‌!

మార్షల్ ఆర్ట్స్
సిద్ధు ఫ్రమ్ సికాకుళం, టార్గెట్, 18,20 లవ్‌స్టోరీ, డైరీ వంటి చిత్రాల్లో తన అందచందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శ్రద్ధాదాస్‌ మహిళలను "మార్షల్‌ ఆర్ట్స్‌" నేర్చుకోమని సలహా ఇస్తోంది. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు పోవడమేకాక చురుగ్గా ఉంటారని అనుభవపూర్వకంగా చెబుతోంది.

చాలామంది హీరోయిన్లు, మహిళలు బరువు తగ్గించుకోవడానికి తెగ తంటాలు పడతుంటారు. ముఖ్యంగా కొవ్వు తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు.

అయితే టార్గెట్‌ నటి శ్రద్ధాదాస్‌ మాత్రం ఒకేసారి 18కేజీలు బరువు తగ్గానని అంటోంది. ఎడతెరిపి లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనడం ఆహారం విషయంలో జాగ్రత్త పడటంతోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం వల్ల బరువు తగ్గడం సాధ్యపడిందని శ్రద్ధాదాస్ చెబుతోంది. అందుకే మహిళల్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమంటున్నానని అంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా "18, 29 లవ్‌స్టోరీ" సినిమాలో విభిన్న పాత్రను పోషిస్తున్న శ్రద్ధాదాస్, చీరకట్టుతో గ్లామర్‌గా ప్రేక్షకులకు దర్శనమివ్వనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.