Srisanth | minisha lamba | china | love | మినిషా-శ్రీశాంత్.. హాయ్... హాయ్
క్రికెటర్లకు, సినిమా తారలకు విడదీయరాని బంధం ఉంది. వీరి మధ్య పరిచయాలు అనేక మార్లు బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల చైనాలోని మకావులో జరిగిన భారత అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో క్రికెట్ శ్రీశాంత్, బాలీవుడ్ తార మినిషాలాంబా కలిసిమెలిసి తిరగడం "టాక్ ఆఫ్ బాలీవుడ్"గా మారింది.
ఈవెంట్ నిర్వహణ సంస్థ అధిపతి శైలేంద్ర సింగ్ ఆహ్వానం మేరకు క్రికెటర్ శ్రీశాంత్ మకావు వెళ్లాడు. అక్కడ ఉన్న క్యాసినోలో శ్రీశాంత్‌కు ఓ బాలీవుడ్ ప్రముఖ నటి మినిషాను పరిచయం చేసిందట. అప్పటి నుంచి వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
పరిచయమైన కొద్ది సమయంలోనే మనస్సు విప్పి మాట్లాడుకోవడం, మకావులోని క్యాసినోలు, రెస్టారెంట్లు, క్లబ్బులు.. ఇలా ఒకటేంటి అన్ని చోట్లా వీరిద్దరే సందడి చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే, మినిషా-శ్రీశాంత్‌ల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని బాలీవుడ్ భామ సన్నిహితులు చెపుతున్నారు. అయితే, 'నిప్పులేనిదే పొగరాదు' కదా అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. మినిషాలాంబా-శ్రీశాంత్ ప్రేమాయణం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.