1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. bollywood

ipl | bollywood | sharuk | karan johar | kajole | Obama | | షారూక్ చిత్రంలో కో స్టార్‌గా "నల్ల సూరీడు"

ఐపీఎల్
FileFILE
ఐపీఎల్‌లో క్లీన్ బౌల్డ్ అయినా బాలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ఫామ్‌లోకి రాబోతున్నాడు కింగ్ ఖాన్. ఈ ఖాన్ నటించే తదుపరి చిత్రంలో కో స్టార్‌గా నల్లజాతి సూరీడు బరాక్ ఒబామా నటించే అవకాశం ఉంది. అయితే, అతని డేట్స్ కోసం షారూక్ చిత్రం దర్శకుడు కరణ్ జోహార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏంటీ.. ఇది నిజమా అని అనుకుంటున్నారా? ఇందులో ఓ చిన్న మతలబుంది లెండీ.

సెన్సేషనల్ డైరక్టర్ కరణ్ జోహార్ డీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి "మై నేమ్ ఈజ్ ఖాన్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్‌ను షారూఖ్ మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో ఒబామా నటిస్తుండటం ఒక విశేషమైతే.. షారూఖ్ సరసన కాజోల్ చాలాకాలం తర్వాత నటించనుండటం మరో ప్రత్యేకత.

"దిల్వాలే దుల్‌హనియా లే జాయెంగే"తో దేశమంతా ఓ ఊపు ఊపిన ఈ జోడీ.. కొత్త చిత్రంలో హల్ చల్ చేయనుంది. తొమ్మిదేళ్ళ తర్వాత.. ఈ లవ్లీ ఫెయిర్‌ను తెరపై చూడనుండటం సినీ అభిమానులకు లక్కీ ఛాన్స్‌లాంటింది. ఈ చిత్రం స్పెషల్ షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లిన ఈ చిత్రం యూనిట్.. ప్రస్తుతం శాన్‌ఫ్రాస్కిస్కోలో చక్కర్లు కోడుతోంది.

షారూఖ్-కాజోల్‌లతో కలిసి నటించబోయే మరో స్టార్ ఒబామా కోసం కరణ్ జోహార్ యూఎస్‌లో సెర్చ్ ఆరంభించారు. అచ్చం ఒబామాలా ఉండే మనిషి కోసం... ఊరూరా వెతుకులాట చేపట్టారట. నల్లసూరీణ్ణి పోలిన ఆఫ్రో అమెరికన్‌ను వెదికి పట్టుకునే ప్రాజెక్టును ఒక ఏజెన్సీకి అప్పగించినట్టు బాలీవుడ్ వర్గాల కథనం.

ఒబామా చిక్కితేనే చిత్రంలోని కీలక సన్నివేశాలు షూట్ అయ్యేలా లేవు. దీంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందట. ఏదైనా సెన్సేషన్ ఉంటే మినహా.. హిట్లు కొట్టలేని ప్రస్తుత తరుణంలో షారూఖ్-కాజోల్-ఒబామాల రేర్ కాంబినేషన్‌లో రానున్న "మై నేమ్ ఈజ్ ఖాన్" కోసం బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి