1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. temperature

Deepika Padukone | temperature | youth | Delhi | దీపిక వెళ్లింది.. అక్కడ టెంపరేచర్ పెరిగింది

దీపికా పదుకునే
యువ హృదయాలను అవలీలగా కొల్లగొట్టగల నున్ననైన సన్నజాజి ముద్దుగుమ్మ దీపికా పదుకునే ఎక్కడికి వెళితే అక్కడ టెంపరేచర్ ఎకాఎకిన పెరిగిపోతోందట. ఇదేదో జ్వరం లాంటిదనుకునేరు. ఎండలట.. దీపిక పదుకునే ఎక్కడ అడుగుపెడితే చాలు అక్కడ బండలు పగిలే ఎండలు కాస్తున్నాయట.

ఇటీవల ఢిల్లీలో ఓ వాచీల కంపెనీ దీపికా పదుకునేతో తమ వాచ్ షో రూమ్‌ను ప్రారంభించాలని ఆమెను ఆహ్వానించిందట. అంతకుముందు రోజు వరకూ కాస్త చల్లగా ఉన్నదనిపించిన ఢిల్లీ, పదుకునే రావడంతో మహా వేడెక్కిందట.

ఇదిలావుంటే పదుకునేను చూసేందుకు కుర్రకారు ఆ షాపు వద్దకు తోసుకుంటూ వచ్చి ఆమెపై ఎగబడ్డారట. టీనేజ్ కుర్రకారు అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో బయట వేడీ, లోపల వేడీ అంతా కలిసి పదుకునేకు చమటలు పట్టించాయట. దీంతో "అయ్య బాబోయ్... నేనీ వేడిని తట్టుకోలేను.." అంటూ దీపిక అక్కడ నుంచి ఉడాయించిదట. మరి సన్నూ, సన్ ఆఫ్‌లతో పెట్టుకుంటే అంతే మరి...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి