1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sexy actress

Namita | Sexy actress | Boy friend | Strong person | | నమితా..! నీ దృఢకాయుడేమయ్యాడూ...?

నమిత
మొదటి నుంచి నమితను వెన్నంటి ఓ దృఢకాయుడు తిరుగుతూ ఉండేవాడు. ఎవరీ దృఢకాయుడూ అని ఎవరైనా ప్రశ్నిస్తే... అతడే తన బాయ్ ఫ్రెండ్ అని డేర్‌గా చెప్పేది బొద్దందాల ముద్దుగుమ్మ నమిత.

నమిత ఎక్కడ ఉంటే అతను అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అయితే ఉన్నట్లుండి ఏమైందో తెలీదు కానీ ఆ దృఢకాయుడు నమిత వెంట కనబడట్లేదు. అసలు విషయం ఏమిటని ఆరాతీస్తే... నమిత తన బొద్దు అందాలకు "బై" చెప్పినట్లే... దృఢకాయునికీ "టాటా" చెప్పేసిందట.

ఇటీవల తెలుగులో నమిత "గ్రాఫ్" చుక్కలు చూస్తున్నట్లు కనిపించడంతో దృఢకాయుడ్ని ఆమె "ఫో"మ్మని చెప్పినట్లు టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. టాలీవుడ్ కుర్రకారు ఇప్పుడిప్పుడే నమితను "ఆబ"గా చూస్తున్నట్లు తెలియడంతో బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌కు బ్రేక్ కొట్టి టాలీవుడ్‌కే అంకితమవుదామని నమిత నిశ్చయించుకుందట.

బెస్ట్ ఆఫ్ లక్ నమితా... పాపం దృఢకాయుని పరిస్థితే..! ఎలా ఉందో..? ఏమో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT