1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Deepika’s butt

Saif | Deepika’s butt | kiss | Love Aaj Kal | సైఫ్... దీపికను తాకరాని‌చోట తాకాడట

సైఫ్ అలీఖాన్ దీపికా పదుకునే
IFM
కరీనా ప్రియుడు సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే నటించిన "లవ్ ఆజ్ కల్ చిత్రంలో సైఫ్ రెచ్చిపోయి నటించాడట. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు దీపికను ఎక్కడెక్కడో తాకేసి ఆమెను మ(స్తు)త్తులో ముంచెత్తి చిత్తు చిత్తు చేశాడట.

ఇంతవరకూ దీపికా పదుకునేను ఏ హీరో తాకని ప్రదేశాలపై సైఫ్ అదేపనిగా తెగ తాకేశాడట. మరీ ముఖ్యంగా ఆమె నడుము భాగంలో కొన్నిచోట్ల అతని చేయి నాట్యమాడుతూనే ఉందట. సన్నివేశాలను రక్తి కట్టించేందుకు ఇలా ఆమె శరీరాన్ని తాకక తప్పలేదంటున్నాడు సైఫ్.

మరి దీనిపై దీపిక ఏమంటుందో అని ఆమెను కదిలిస్తే... అవునని తలూపుతోందట. "సైఫ్ నన్ను ఎన్నోచోట్ల తాకాడు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నాం. నిజమైన ప్రేమికులు ఎక్కడెక్కడ స్పృశించుకుంటారో... అలాగే మేమూ రెచ్చిపోయాం. లేకపోతే సినిమాలో ప్రేమ సన్నివేశాలు ఎలా రక్తి కడతాయ్.

ముద్దు సీను చిత్రీకరిస్తూ, పెదవులతో పెదవులను కలిపినట్లు చూపకపోతే అది "ముద్దు" ఎలా అవుతుంది. నిజజీవితంలో ప్రేమికుడు ప్రియురాలిని చాలా చోట్ల తాకాలనుకుంటాడు. అతనికి ఏ భాగాలు ఇష్టమైతే అక్కడ తాకేందుకు ఉత్సుకత చూపుతాడు. కనుక సినిమాలోనూ మేము అదే చేశాం" అని బుకాయిస్తోందట దీపికా పదుకునే.

కనుక ప్రేమ"తాకుళ్ల" పట్టు గురించి తెలుసుకోవాలంటే దీపికను, సైఫ్‌ను అడిగి తెలుసుకోవచ్చన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT