1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. bollywood

homo sexuvals | bollywood | selina jaitly | support | | స్వలింగ సంపర్కానికి బాలీవుడ్ మద్దతు!

హోమో సెక్సువల్స్
స్వలింగ సంపర్కారనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు.. మోడళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనే అనేక మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని ప్రముఖ నటి సెలీనా జైట్లీ బాంబు పేల్చారు. దేశంలో స్వలింగ సంపర్కానికి అడ్డుగా ఉన్న 377 సెక్షన్‌ను రద్దు చేస్తే వీరంతా స్వేచ్ఛగా తమ సుఖాన్ని అనుభవిస్తామని అమె హితవు పలుకుతోంది.

అదేసమయంలో స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతోంది. దీంతో హోమోలు చేస్తున్న పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సెలీనా జైట్లీ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లోనే ఎక్కువ మంది హోమోలు ఉన్నారని చెపుతోంది. ఒక్కసారి 377 సెక్షన్‌ను రద్దు చేస్తే, బాలీవుడ్‌లోని ప్రముఖులు తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టేందుకు ఏమాత్రం వెనుకంజ వేయబోరని చెప్పుకొచ్చారు.

అలాగే, సూపర్ మోడల్ డినోమోరియా కూడా హోమో సెక్సువల్స్ పట్ల సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని కూడా తొలగించాలని అభిప్రాయపడింది. మరో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానుగుణంగా వచ్చే మార్పులను భారతీయ సమాజం కూడా అర్థం చెసుకోవాలంటూ కోయినా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. మొత్తం మీద హోమో సెక్సువల్స్ ప్రదర్శలకు ఇపుడు తారల మద్దతు కూడా తొడుకావడం గమనార్హం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి