1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. VarunSandesh

Tamanna| VarunSandesh| Happy Days| Evarina Epudina | తమన్నా నాకు సరైన జోడి: వరుణ్ సందేశ్

తమన్నా
WD
"హ్యాపీడేస్"లో అందాల సెక్సీతారతో జతకట్టిన వరుణ్ సందేశ్, మళ్లీ మళ్లీ ఆమెతోనే నటించాలని కోరుకుంటున్నాడు.

హ్యాపీడేస్‌లో బక్కగా ఉన్న తనతో తమన్నా కెమిస్ట్రీ అదిరిందని వరుణ్ అంటున్నాడు. కొత్తబంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా వంటి ఎన్ని చిత్రాలు చేసిన తనకు తమన్నా సరైన జోడీ అని వరుణ్‌ సందేశ్ చెబుతున్నాడు.

తాజాగా ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థపై రూపుదిద్దుకున్న "ఎవరైనా ఎప్పుడైనా"లో తన సరసన నటించిన విమలారామన్‌ తనకంటే పెద్దదిగా కన్పించిన మాట వాస్తవమేననీ, కానీ అది దర్శక నిర్మాతల నిర్ణయం కనుక తానేమీ చేయలేకపోయానని మనసులోని మాటను వరుణ్ సందేశ్ చెప్పాడు.

ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తోన్న "మరో చరిత్ర"లో వరుణ్‌‌సందేశ్ నటిస్తున్నాడు. మరోవైపు జెమీనీ సంస్థ తాజాగా నిర్మించే కొత్త చిత్రంలోనూ వరుణ్ నటించనున్నాడు. ఆ చిత్రానికి గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్‌ గంగరాజు దర్శకుడనీ, ఆ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదనీ అతడు వెల్లడించాడు. కానీ ఓ తాను యు.ఎస్‌. వెళితే అక్కడివారంతా జెమిని కొత్త సినిమా పేరు 'విజేత' కదా? అని చెప్పడంతో ఆశ్చర్యమేసిందని సందేశ్ తెలిపాడు.

"ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు) సినిమాలోలాగా ఇంకా తాను ప్రేమలో పడలేదనీ, తమన్నా వంటి జోడి కుదిరితే తప్పకుండా ప్రేమలో పడటమే కాదు.. ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటానని వరుణ్ అసలు విషయాన్ని వరుణ్ బయటపెట్టేశాడు. మరి సెక్సీ క్వీన్ తమన్నా ఈ మాట వింటే ఏమంటుందో..? వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M