1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. dad

Asin | dad | sets | heroes | అసిన్.. మీ నాన్నను తీసుకురావద్దు: హీరోలు

గజినీ
హిందీ 'గజినీ'తో బాలీవుడ్‌లో అసిన్‌కు అవకాశాలు దండిగానే వస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు అంగీకరిస్తుంది కూడా. ప్రస్తుతం కత్రినా ప్రియుడు సల్మాన్‌తో కలిసి "లండన్ డ్రీమ్స్" చిత్రంలో నటిస్తోంది.

సినిమా బ్రహ్మాండంగా వస్తోందట. అయితే షూటింగ్ జరిగిన అనంతరం హీరోలు తమ ముఖాలను కందగడ్డల్లా పెట్టుకుని కూచుంటున్నారట. దీనికి కారణం ప్రతిరోజూ షూటింగ్ స్పాట్‌కు అసిన్ తన తండ్రిని వెంటేసుకుని రావడమేనట.

అసిన్ తండ్రి వారికి ఏ విషయంలో అడ్డు తగిలాడో ఏమోగానీ.. సల్మాన్, అజయ్ దేవగన్ ఇద్దరూ అసిన్‌తో "షూటింగులకు మీ నాన్నను తీసుకురావద్దు" అని ముఖం మీద చెప్పేశారట. అంతే... అసిన్ తన తండ్రికి విషయాన్ని చెప్పి రావద్దందట.

మొన్నటివరకూ ప్రతి షూటింగ్ స్పాట్‌కి తండ్రితో కలిసి వచ్చే అసిన్ ఇప్పుడు వంటరిగానే వచ్చి వెళుతోందట. ఎలా వెళుతుందో.. ఏమో...? అని అసిన్ తండ్రి మాత్రం బెంగపడుతున్నారట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT