1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. ప్రియమణి- తరుణ్ పెళ్లి చేసుకుంటారేమో...?!

Priyamani, marry, Tollywood, Kollywood, | ప్రియమణి- తరుణ్ పెళ్లి చేసుకుంటారేమో...?!

ప్రియమణి
ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లోనూ అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనే నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.

తన సహజ నటనతో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న ప్రియమణికి ఆ తర్వాత కోలీవుడ్‌లో అన్నీ అటువంటి "మురికి" పాత్రలే వచ్చాయట. అదేమంటే మీకు జాతీయ అవార్డు తెచ్చిన పాత్ర అటువంటిదే కదా అని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట కోలీవుడ్ సినీజనం.

దీంతో విసుగెత్తిన ప్రియమణి టాలీవుడ్‌లో తన జాతకాన్ని పరీక్షించుకునేందుకు బయలుదేరి వచ్చింది. అందాల ఆరబోతకు గేట్లను బార్లా తెరిచింది. బాలకృష్ణతో కలిసి "మిత్రుడు" చిత్రంలో బికినీ వేసుకుని నటించింది. కానీ 'లక్' కలిసి రాలేదు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది.

ఆ తర్వాత ప్రియమణికి అవకాశం ఇస్తామంటూ టాలీవుడ్‌లో అడిగినవారే కనబడలేదంటున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి బాయ్‌ఫ్రెండ్ ఎవరూ...? అనే సందేహం కలుగవచ్చు. ఆ మధ్య కుర్ర హీరో తరుణ్‌తో నవవసంతం చిత్రం చేసింది ప్రియమణి. ఆ చిత్రం చేసే సమయంలో వాళ్లిద్దరి మధ్య పెరిగిన పరిచయం అలాగే కొనసాగుతోందట.

వీళ్లద్దరి వ్యవహారం చూసినవారు పెళ్లి చేసుకుంటారేమో అని అనుకుంటున్నారట. ఎలాగూ... తరుణ్‌కి కూడా అంతగా సినీ అవకాశాలు లేవు కదా.. చూద్దాం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT