Dhoni | Lakshmi Roy | Kollywood | Marriage | | ధోనీ అడిగితే... పెళ్లి చేసుకుంటా: లక్ష్మీరాయ్
|
ఆ తర్వాత అతని జూలు బాగోలేదని ఎడమచేతి వాటం క్రికెటర్ యువరాజ్‌ను సెలక్ట్ చేసుకుందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడేమో వాళ్లిద్దరినీ కాదని హీరోలతో 'లిప్-టు-లిప్ కిస్సులిచ్చుకుంటూ క్రికెటర్లకు ఒట్టి చేయి చూపించింది.
ఇప్పడు అదే దారిలో కోలీవుడ్ నటి లక్ష్మీరాయ్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని పాత్రికేయులకు పిలిచి మరీ చెపుతోందట. అంతేనా...! ధోనీ కనుక తనను పెళ్లాడమని అడిగితే అందుకు సిద్ధంగా ఉన్నానంటోందట.
ధోనీతో రెండేళ్లుగా ఉన్న పరిచయం కొద్దీ ఈ మాటలు చెపుతున్నానంటోదట. ధోనీ ఎంతో సౌమ్యుడనీ, అటువంటివాడు భర్తగా దొరకడం నిజంగా అదృష్టమని అంటోందట. అన్నట్లు లక్ష్మీరాయ్ కూడా తన కెరీర్ బిల్డప్ కోసం ఇలా ధోనీ పేరును ఉపయోగించుకుంటుందంటారా..? ఏమో..? అసలు ధోనీనే లక్ష్మీరాయ్ స్నేహం విషయాన్ని అడిగితే తేలిపోతుంది. ఈసారి మన పిల్ల జర్నలిస్టుకు ధోనీ దొరికినపుడు అడగమని చెపుదాం...
