గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » "కరెంట్" హీరోయిన్ 'స్నేహా ఉల్లాల్‌'పై చర్య? (Current| Sneha Ullal| Raju Maharaju| Mohan Babu| Kumaraswamy)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
"రాజు మహరాజులో మొదట స్నేహా ఉల్లాల్‌ను అనుకున్నాం. ఆమె ఫొటోసెషన్‌కోసం 4లక్షల ఖర్చు పెట్టాం. ఆమెతోపాటు నలుగురు అదనంగా వచ్చారు. వారికి స్టార్‌ హోటల్‌ సౌకర్యం కల్పించారు. వారం రోజులున్నారు.

కానీ చివరిగా ఏదో కారణం చెప్పి డేట్స్‌ కుదరడంలేదని తప్పించుకుంది ఉల్లాల్. అప్పటికే ఆమెకు 10లక్షలు అడ్వాన్స్‌గా యిచ్చాం. దాంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ సరైన స్పందనలేదు. చేద్దాం.." అంటూ గురువారం రాజు మహారాజు నిర్మాత ఇచ్చిన సెన్సేషనల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న తెలిపిన మాటలివి.

వార్తాపత్రికల్లో వార్తలు ప్రచురితం అయ్యాక దానిపై అధికారులు స్పందన అంటూ.. ఆయా పత్రికల్లో కథనాలు వెలువడటం అందరికీ తెలిసిన విషయమే. అయితే వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలకు స్పందనలు పెద్దగా తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో గురువారం "రాజు మహారాజు" చిత్ర నిర్మాత కుమారస్వామి వెబ్‌దునియాడాట్‌కామ్‌కు సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో సినీ ప్రముఖులు, స్నేహా ఉల్లాల్ చేసిన మోసం గురించి కుమార స్వామి వివరించారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాతల మండలి స్నేహా ఉల్లాల్‌పై చర్య తీసుకోనుందనే వార్త ఇండస్ట్రీలో ప్రచారమైంది. ప్రస్తుతం సుశాంత్ చిత్రం కరెంట్ విజయయాత్రలో ఉంది. ఆమె నిర్మాత దాదాపు 15లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో నటించకుండా పోవడంతోపాటు, పారితోషికం వెనక్కు ఇవ్వకపోవడంతో నిర్మాత ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా.. అదే తరహాలో కేసులు నిర్మాతల మండలి ముందుకు వచ్చాయి. తాజాగా రాజమౌళి ఉదంతం ఇంకా ఫైనల్ కాలేదు. ఓ నిర్మాతకు పది లక్షలు ఇచ్చి సినిమా చేయమన్నారు. సంవత్సరాలు గడిచినా సినిమాలు చేయకపోవడం, తిరిగి డబ్బులు వాపసు ఇవ్వకపోవడంతో ఆయన కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. మరి ఈ రెండు సంఘటనలు రాజీకి వస్తాయో? లేదో? వేచి చూడాల్సిందే. అందుకే పెద్దలన్నట్లు.. రూపాయి బయటకు పోతే రాదంటారు నిజమే మరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కరెంట్, హీరోయిన్, స్నేహా ఉల్లాల్, రాజు మహారాజు, మోహన్ బాబు, కుమార స్వామి