Amrita Rao | hottest | sexiest | glamorous | Bikini actress | ఇక లాభం లేదు... బికినీలో నటించాల్సిందే
| బాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలను పోషిస్తూ వచ్చిన అమృతారావు ఇక నుంచి పూర్తిస్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేస్తానని బాలీవుడ్ దర్శక నిర్మాతలకు చెపుతోందట. కెరీర్ ప్రారంభంలో తొడలు కనిపించే దుస్తులు వేసుకోవాలని కొందరు దర్శకులు పెట్టిన షరతులను ఆమె తోసిపుచ్చి అసలు అటువంటి "A" సినిమాల్లో నటించనని చెప్పిందట. దాంతో చాలామంది బాలీవుడ్ దర్శకులు అమృతను అలా వదిలేశారట. |
పరిస్థితిని గమనించిన అమృతారావు తనే చొరవ చూపి దర్శకనిర్మాతల వెంటబడుతున్నా సినిమా ఛాన్సులు ఇవ్వట్లేదట. అందుకేనేమో ఆ మధ్య టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది. మహేష్‌తో అతిథిలో నటించింది. ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఈ వంక చూడలేదు.
చివరికి ఎలాగైనా బాలీవుడ్‌లోనే నిలదొక్కుకోవాలనే తలంపుతో పొదుపైన బికినీల్లో సైతం దర్శనమిస్తానని చెపుతోందట. అమృతలో మార్పు వచ్చింది సరే... మరి నిర్మాతలలో కూడా రావాలిగా..?
