Priyanka Chopra | boy friends | dinner | Sweets | నా బాయ్‌ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తే రుచి చూస్తా
బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమకు బాయ్‌ఫ్రెండ్స్ లేరంటే ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత మగస్నేహితుల ఆసరాను కథానాయికలు తప్పనిసరిగా కోరుకుంటారు.
ప్రియాంకా చోప్రా కూడా తను రిలాక్స్.. అంటే షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు తన ఇంటికి మగస్నేహితులను ఆహ్వానిస్తుందట. ఆ రోజు వాళ్లకు తనే స్వయంగా అన్నీ వడ్డించి వారికి కడుపారా భోజనం పెడుతుందట.
ఏ బాయ్‌ఫ్రెండ్‌కు ఎలాంటి పదార్థాలు కావాలో ముందే ఫోనులో తెలుసుకుని వాటన్నిటినీ తెప్పిస్తుందట. ఆ తినుబండారాలను వాళ్లు తింటుంటే ప్రియాంక మాత్రం లొట్టలేసుకుంటూ వారివంక చూస్తూ కూచుంటుందట.
ప్రియాంక అవస్థను చూసిన కొందరు బాయ్‌ఫ్రెండ్స్ ఆమెను కంపెనీ ఇవ్వమని అడిగితే, "బాబోయ్... మీరు తినేవి నేను తినలేను. తినను. తిన్నానంటే "బోండాం"లా తయారవుతానని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు. అందుకే.. ఎలాగూ నేను తినలేను కదా... మీకు తినిపించి నేనే తిన్నట్లు తృప్తి పడుతుంటా.." అందట.
అంతే.. పరిస్థితిని అర్థం చేసుకున్న స్నేహితుల్లో ఒక కుర్ర స్నేహితుడు లేచి ఓ స్వీటును పట్టుకుని బలవంతంగా ప్రియాంక నోటిలో అదిమాడట. స్నేహితులకోసం... చేసేది లేక ఆ తీపి పదార్థాన్ని బలవంతంగానే చప్పరించానని చెపుతోంది ఈ బ్యూటీ.