bollywood | karina kapoore | boy | actress | | నాకు అబ్బాయిలంటే మహా ఇష్టం: కరీనా
బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్‌కు అబ్బాయిలంటే తెగ ఇష్టమట. అందుకే యవ్వనంలో ఉండే కుర్రకారుతో స్నేహం చేయడం కోసం ఎక్కువ ఆసక్తి చూపుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కరీనా, అక్షయ్ నటించిన "కంబక్త్ ఇష్క్" అనే చిత్రంలో విడుదలైంది.
ఈ చిత్రంలో మాత్రం అబ్బాయిలు మోసగాళ్లని, నమ్మించి మోసం చేస్తారంటూ వారికి దూరంగా ఉండే పాత్రలో ఈ బేబో కనిపించింది. నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటారా అని విలేకరులు ప్రశ్నిస్తే మాత్రం కాదుకాదు అంటోంది.
తనకు అబ్బాయిలతో స్నేహమంటే చాలా ఇష్టమని చెప్పింది. కలివిడి స్వభావం కావడంతో వారితో త్వరగా కలిసి పోతానని చెపుతోంది. స్కూల్లో కూడా తనను అబ్బాయిలా చూసే వారని చెప్పుకొచ్చిందీ భామ.