Varudu| Mahesh Babu| Anushka| Trivikram| Kamalini| Parvathi Melton | "వరుడి"కి అచ్చిరాని సెకండ్ హీరోయిన్స్!
|
ఈ సినిమాలో రెండో కథానాయిక పాత్ర నిడివి చాలా తక్కువని, అందుకే పేరున్న హీరోయిన్లు ఇందులో నటించేందుకు తలను ఇటూ.. అటూ ఊపుతున్నారని సినీ జనం చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా తాము డాన్స్‌లో నెంబర్ వన్ కావడం కోసమో, కొన్ని రొమాన్స్ సీన్స్ కోసమో పరిమితం కాలేమని హీరోయిన్స్ తేల్చి చెప్పేస్తున్నారట.
దీనికి కారణమేమిటని ఆరాతీస్తే..? పవన్‌కళ్యాణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన 'జల్సా'లో "పవన్ సరసనే కదా..! పర్వాలేదని కమలిని ముఖర్జీ" నటించింది. అయితే ఆ పాత్ర చిన్నది.. పైగా ఆమెకు ఆంటీ లుక్ రావడంతో ఆ తర్వాత కమలినికి పెద్దగా ఆఫర్లు రావట్లేలేదని ఇండస్ట్రీలో టాక్.
అంతేకాదు.. ముందుగా పార్వతి మెల్టన్‌ను "వరుడు" సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశారని, అయితే "జల్సా"లో సెకండ్ హీరోయిన్‌గా పార్వతికి గుర్తింపు రాకపోవడంతో ఆమెను "వరుడి" సినిమా నుంచి తొలగించినట్లు టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఈ "జల్సా" సినిమాతో మిగతా అగ్రహీరోయిన్లకు కనువిప్పి కలిగిందని.. అందుకే "వరుడి" కోసం సెకండ్ హీరోయిన్‌గా నటించమని నిర్మాతలు వచ్చి అడిగితే హీరోయిన్లంతా మూకుమ్మడిగా తమకు డేట్స్ ఖాళీగా లేవని చెప్తున్నారని తెలిసింది. ఇంకేముంది..? "వరుడు" సరసన రెండో కథానాయికగా నటించేందుకు ఏ భామ అంగీకరిస్తుందో? వేచి చూడాల్సిందే..!.
