1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Salman Khan

Katrina | Salman Khan | Fear | French | cinema | కత్రినాకు సల్మాన్ భయం పట్టుకుందట..

కత్రినాకైఫ్
కత్రినాకైఫ్‌కు కొత్తగా సల్మాన్ ఖాన్ భయం పట్టుకుందట. మొన్నటివరకూ చేతుల్లో చేతులేసుకుని ఎంతో సన్నిహితంగా సల్మాన్‌తో తిరిగిన ఈ భామ పుటుక్కున ఆ బంధాన్ని తెంచేసుకుంది. అది చాలక తోటి హీరోలతో నటిస్తున్న సినిమాల్లో లిప్-టు-లిప్ కిస్‌లిస్తోంది.

కత్రినా వ్యవహారాన్ని చూసిన సల్మాన్ పళ్లు పటపట కొరుకుతున్నాడట. తన స్నేహితుల వద్తన అక్కసును వెళ్లగక్కుతున్నాడట. సల్మాన్ కోపాన్ని గమనించిన కత్రినా ప్రస్తుతం తను ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి వేరే ఇల్లుకు మారిపోవాలని చూస్తోందట.

చివరికి ఓ ఇల్లు నచ్చడంతో... అందులో చేరిపోదామనుకున్నదట. అయితే ఆ రోజే ఒక ఆకతాయి, "కత్రినా నన్ను పెళ్లి చేసుకోవూ..." అంటూ తన కారు వెంటబడ్డాడట. దీంతో బెంబేలెత్తిన కత్రినాకైఫ్ ఆ ఇల్లునూ వదిలేసి మరో ఇంటికోసం బురఖా వేసుకుని బాంబేలో తిరుగుతోందట.

బాలీవుడ్‌లో తన పరిస్థితి దృష్ట్యా హాలీవుడ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కైఫ్ సన్నిహితులు చెపుతున్నారు. నటన సంగతి ఎలా ఉన్నా... తను ఇప్పటివరకూ సంపాదించిన డబ్బుతో ఫ్రెంచ్ సినిమాలను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు బాలీవుడ్ సినీజనం చెపుతున్నారు.

పాపం... కత్రినాకు ఎన్ని కష్టాలు వచ్చాయో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT