1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Mahesh Babu

Amrutha Rao| Mahesh Babu| Athidi| Shahrukh| Shahid | "ఎస్" అంటే ఓకే..! లేదంటే ''నో''..!: అమృత

అమృతారావు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన "అతిథి" సినిమాలో నటించిన బాలీవుడ్ చిన్నది అమృతారావుకు కొత్త సెంటిమెంట్ ఎక్కడ నుంచో పుట్టుకొచ్చిందట. 'అతిథి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమృతరావు హిందీలో 'వెలకమ్‌ టు సజ్జన్‌పూర్‌' తో అభినందనలు సంపాదించింది. ప్రసుత్తం 'షాట్‌' అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ నేపథ్యంలో అమృతారావు కెరీర్‌పరంగా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోందని సినీజనం చెప్పుకుంటున్నారు. 'ఎస్‌' అక్షరంతో మొదలయ్యే హీరోలతో చేస్తేనే సక్సెస్‌ వస్తుందని అమృత నమ్ముతున్నట్లు తెలిసింది.

దీనికి షారూఖ్‌, షాహిద్‌, శ్రేయాస్‌ కాంబినేషన్‌లో అమృత చేసిన సినిమాలు హిట్‌ అవడమే కారణమని సమాచారం. దీంతో "ఎస్" అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల హీరో సరసనే నటించాలని అమృత భావిస్తోందట. దీనికోసం మంచి మంచి ఛాన్సులు కూడా అమ్మడు మిస్ చేసుకుంటోందట. అంతేకాదు..? "ఎస్" అంటే ఓకే.. లేదంటే "నో" అంటుందని తెలిసింది.

మరి దర్శకుల వద్ద అమృతారావు "ఎస్‌" సెంటిమెంట్‌ చెబితే ఈమె వ్యవహారం బాగా మారిందిలే అంటున్నారట..!. ఇంకేముంది..? అమృతారావు "ఎస్" సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో? వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M