Priyanka Kothari | Ram Gopal Varma | Nitin | kiss | వర్మ "అడవి"లో ''కిస్ యూ డే అండ్ నైట్''
క్రియేటివ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్రమంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొంటాయి. చిత్ర కథనం ఎంతో వైవిధ్యంగా సాగిపోతుంది. ఇక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు సైతం వెరైటీగా ఉంటాయి.
అదలా వుంచితే తాజాగా వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న "అడవి" చిత్రం సైతం ఎంతో వైవిధ్యంగా సాగుతుందట. దీనితోపాటు హీరోహీరోయిన్ల మధ్య శృంగార రసం ఒలికి పోతుందట. రొమాంటిక్ సన్నివేశాలలో భాగంగా ఇటీవల నితిన్- ప్రియాంక కొఠారిపై ముద్దుతో కూడిన ఓ పాటను చిత్రీకరించారట వర్మ.
ఆ పాటలో ప్రియాంక సముద్రంలో తన శరీరాన్ని పూర్తిగా తడిపేసుకుని ఆపై ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడుతుందట. అసలే పొదుపైన బికినీ.. ఆపై తడిసి శరీరం... ఆ శరీరానికి అంటుకున్న మట్టి. ఈ దశలో ప్రియాంకా కొఠారి కుర్రహీరో నితిన్‌తో "కిస్ యూ డే అండ్ నైట్" అని వేడి వేడిగా పాడుతూ రెచ్చగొడుతుందట.
