1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Iliyana

kikk | Iliyana | Tamannah | Tamil kikk | ఇక్కడ ఇలియానా "కిక్"... అక్కడ తమన్నా "తక్ దిక్"

కిక్
టాలీవుడ్‌లో ఇలియానా రేంజ్ పెరిగిపోయిందంటున్నారు తెలుగు సినీజనం. తనతో సినిమా తీయాలనే సంకల్పించే ఏ నిర్మాతైనా కదిలిస్తే, "కోటిన్నర రూపాయల పారితోషికాన్ని సిద్ధం చేసుకుంటే నటించడానికి సిద్ధమ"ని చెపుతోందట. టాలీవుడ్ నిర్మాతల సంగతేమోగానీ ఈ మాట విన్న కోలీవుడ్ నిర్మాతలు మాత్రం గుడ్లు తేలేశారట. 

ఎందుకలా... అంటే జయం రవి హీరోగా తమిళంలో 'కిక్' నిర్మించడానికి తెలుగు కిక్ రైట్స్ కొనుక్కున్నాడట ఓ తమిళ నిర్మాత. తమిళ 'కిక్'లోనూ హీరోయిన్‌గా ఇలియానా అయితే బావుంటుందని ఫోను కలిపారట. పారితోషికం కోటిన్నర అని వినిపించిందట.

అంతే.. మరోమాట మాట్లాడకుండా ఫోను కట్ చేసి కోలీవుడ్ కోవాగా పిలువబడుతోన్న తమన్నాకు ఈ అవకాశాన్ని కట్టబెట్టారట. అప్పట్నుంచీ తమన్నా హుషారుకు అంతే లేదట. ఈ చిత్రం కనుక హిట్టయితే తమన్నా రెమ్యునరేషన్ రేంజ్ కూడా కోటి దాటుతుందంటున్నారు కోలీవుడ్ సినీజనం. సో.... తమన్నాకు మాంద్యంలోనూ హ్యాపీడేసే అన్నమాట. దేనికైనా "లక్" ఉండాలి మరి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT