Asha Shaini | Mayuri | marriage | | పెళ్లి చేసుకుని ప్రేక్షకులను వదిలిపెట్టలేను
పెళ్లిపై ధ్యాస మళ్లడం లేదని చెపుతోంది మయూరీ ఉరఫ్ ఆషా శైనీ. అందరూ తనను పెళ్లెప్పుడు చేసుకుంటావని అడుగుతున్నారనీ, అయితే వారందరికీ తను ఎన్నోసార్లు బదులిచ్చానని అంటోంది. ఇంతకీ ఏం చెప్పావేంటీ...? అని అడిగితే, "ఇంకొన్నాళ్లు వెండితెరపై వెలిగిపోవాలన్న కోరిక ఉందని" అంటోంది.
ఈ మాటను ఇలా ఎన్నోసార్లు చెప్పినా మళ్లీ పెళ్లి గురించి అడిగే మీడియా మిత్రులంటే నాకు చిరుకోపం వస్తుందని అంటోంది. (శైనీ చిరు కోపాన్ని రుచి చూసిన మీడియా మిత్రులెవరో మరి...?)
ప్రేక్షకులు ఎక్కువకాలం తనను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాననీ, ఇంకా వారికి దగ్గరవ్వాల్సి ఉందని చెపుతోందీ సెక్సీ డాళ్. తాజాగా మయూరి నటిస్తున్న చిత్రం 'ఆ ఇంట్లో ఒకరోజు'. ఈ చిత్రంలో గృహిణి పాత్రలో నటించింది.