Apoorva| Young| Aunty| Heroine| Age| Birthday | నేనింకా కుర్రదాన్నే..! నన్ను ఆంటీ అంటావా..?
హీరోయిన్లు సహజంగా వయస్సు చెప్పరు. అలా పుట్టినరోజు జరుపుకున్నప్పటికీ ఇండస్ట్రీకివచ్చి 3 లేదా 4వ పుట్టిన రోజంటూ చెబుతుంటారు. మించిపోతే.. జస్ట్ 21 అంటారు.
అదెలా ఉన్నా పలుచిత్రాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్క, వదిన పాత్రల్లో నటించిన అపూర్వ తాను ఇంకా కుర్రదాన్నేనని చెబుతోంది.
ఓ కొత్తదర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో అపూర్వ నటిస్తోంది. పాపం ఆ కుర్ర దర్శకుడు షాట్‌కోసం ఆమె దగ్గరకు వెళ్ళి 'ఆంటీ.. షాట్ రెడీ.. రండి..' అన్నాడట. అంతే.. అపూర్వ తాచుపాములా ఇంతెత్తున లేచి.. నన్ను ఆంటీ అంటావా? నేను ఆ వయసు దానిలా కనబడుతున్నానా? ఇంకా కుర్రదాన్నిలా ఉంటే నన్ను అంతమాట అంటావా? అంటూ రభస చేసిందట. దీంతో దర్శకుడు భయపడిపోయి షూటింగ్ ప్యాకప్ చెప్పాడని సమాచారం.
మర్నాడు షూటింగ్‌లో పాల్గొన్న అపూర్వను 'అపూర్వ మేడమ్... మిస్ అంటూ..' రూటుమార్చి పిలవడం.. జరిగినదానికి సారీ చెప్పడంతో.. అపూర్వ ఆంటీ( సారీ... మేడమ్ ఆర్ మిస్) శాంతించిందట..!
టాలీవుడ్‌లో అపూర్వను ఎవరైనా ఆంటీ అన్నారో... ఆంటీ "మే....డమ్" అవుతుంది. మెడబట్టుకు బాదినా బాదుతుంది... జాగ్రత్త!!