గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » 'శివ' రీమేక్‌లో నాగచైతన్య..!? (Siva| Remake| Nagachitanya| Josh| JD| RamGopal Varma)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్‌ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని వెంకట్‌ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఈ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది.

మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్‌'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డ్ హ్యాండ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శివ, రీమేక్, నాగచైతన్య, జోష్, జెడి, రామ్గోపాల్ వర్మ, కార్తీక