Salman- 43 | Katrina kaif-25 | Old salman | young katrina | సల్మాన్- 43, కత్రినా- 26. ఎలా కుదురుతుందీ..?
సల్మాన్ ముసలివాడయ్యాడా..? అందుకే కత్రినా హ్యాండ్ ఇచ్చిందా...?
|
అవుననే అంటున్నారు బాలీవుడ్ సినీజనం. ప్రస్తుతం సల్మాన్ వయసు 43 సంవత్సరాలు. కత్రినా కైఫ్ రేపటి జూలై 16తో 26 ఏటలోకి ప్రవేశిస్తుంది.
ఇద్దరి వయసులను పోల్చి చూస్తే సల్మాన్ వయసులో కత్రినా వయసు సగం. ఈ సంగతి తెలుసుకున్న కత్రినా క్రమంగా సల్మాన్‌కు దూరమైనట్లు బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.
దీనికితోడు సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్య మీసాలు, గడ్డాలతో ఉన్న పాత్రలవైపు మొగ్గు చూపుతున్నాడట. వయసు మీద పడటం వల్లనే ఇటువంటి క్యారెక్టర్లకు సల్మాన్ సిద్ధమవుతున్నట్లు మరికొందరు వాదిస్తున్నారు.
అయితే సినిమాల్లో క్యారెక్టర్లకు తగ్గట్లుగా గడ్డాలు, మీసాలు పెంచుకోవడం... పెట్టుకోవడం సహజమేనని సల్మాన్ సన్నిహితులు వాదిస్తున్నారు. సల్మాన్ వయసు 43 అయినా చూసేందుకు 30లా కనిపిస్తాడని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.
ఏదేమైన వెధవ వయసు యవ్వనాన్ని మింగేస్తుంది. ఇది మాత్రం నిజం. 'మైనే ప్యార్ కియా' సల్మాన్‌కీ - 'టెన్ క ధమ్' సల్మాన్ లుక్కుకీ తేడా లేదూ...?
