Deepika Padukone| Bollywood| Love For Ever| Life| Hindi | "లవ్వంటే మాయ.. లైఫే ఓ మాయ..!": దీపిక
"లవ్వంటే మాయ... లైఫే ఓ మాయ.... నచ్చినట్లు చేయండి." అని బాలీవుడ్ నటి దీపికా పడుకొనే అంటోంది. జయంత్ సి. ఫర్జానీ రూపొందిస్తున్న 'లవ్ ఫర్ ఎవర్' అనే చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.
అహ్మద్‌ఖాన్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జయంత్ సి. ఫరాన్జీ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అంతా కొత్తవారితో తీస్తున్న ఈ చిత్రానికి దీపిక పడుకొనే స్పెషల్ సాంగ్ ద్వారా ఎట్రాక్షన్ చేయించారు.
ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ... దక్షిణాదిలో చాలా ఆఫర్స్ వచ్చినా హిందీలో బిజీగా ఉండడం వల్ల అంగీకరించలేదన్నారు. జయంత్ తనకు ఫ్రెండ్ కావడంతో కథ నచ్చి అందులో ఇన్‌వాల్వ్ అవ్వాలనే పాట చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ, దీపిక పాట చేస్తే బాగుంటుందనే కథ చెప్పాను. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె బిజీగా ఉంది. ఈ షూటింగ్‌లో ఆమె గురించి తెలిసి హిందీలో ఓ సినిమా చెయ్యాలని కథ కూడా చెప్పాను. అందులో రణబీర్ హీరోగా అనుకుంటున్నాం. ఇక "లవ్ ఫర్ ఎవర్" చిత్రంలో దీపికా పాట హైలైట్. 4 కెమేరాలతో ఈ పాటను చిత్రించాం.
మనం ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే చేసేయ్యాలి అన్నది ఈ కథలోని పాయింట్. ఈ అంశాన్ని తీసుకుని వైవిధ్యంగా మలిచిన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు వెల్లడించారు. ఆగస్టులో చిత్రాన్ని పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రణదీప్, మృదుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: సుమంత్ సి. ఫరాన్జీ.