1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sayyata

Charmi| Sayyata| Devi Sri prasad| Hero| Set| Airport | ఛార్మి "సయ్యాట"కు వర్షం దెబ్బ!

ఛార్మి
నటి ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం "సయ్యాట". ఇందులో దేవీశ్రీప్రసాద్‌ కూడా నటిస్తున్నాడు. అతని పాత్ర హీరోనా? కాదా? అనే విషయాన్ని నిర్మాతే బయటకు పొక్కనీయడంలేదు.

ఇందులో దేవీశ్రీప్రసాద్‌ కీలక పాత్ర అని మాత్రం చెబుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్‌వేశారు.

మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్‌ జరగాల్సి ఉంది. సోమవారం రాత్రి వీచిన గాలికి, కురిసిన వర్షానికి సెట్ చిందరవందరయింది. దీంతో మంగళవారం నుంచి జరగాల్సి షూటింగ్‌ వాయిదాపడింది. నిర్మాత రావ్‌కు సంఘీభావంగా ఛార్మి కాస్త ధైర్యాన్నిచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం మొదటనుంచి కొన్నిఅడ్డంకులు వస్తూనే ఉన్నాయి. దేవీశ్రీప్రసాద్‌తో ఆమెకు ఎఫైర్‌ ఉందని ఇండస్ట్రీ భావిస్తున్ననేపథ్యంలో ఇద్దరూ జంటగా నటిస్తున్నారనే వార్తలు వ్యాపించడంతో ఈ సినిమా చేయనని దేవీశ్రీప్రసాద్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దాంతో కొన్నాళ్ళు సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.