1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Love for Ever

Deepika Padukone | Love for Ever | hot song | Bollywood | old heros | బాలీవుడ్ ముసలాళ్లతో బోర్.. బోర్!!: దీపికా పదుకునే

బాలీవుడ్
బాలీవుడ్ ముసలి హీరోలతో నటించి నటించీ దీపికా పదుకునేకు బోర్ కొట్టిందట. తన వయసేమో 23 ఏళ్లేనట. తనకు అవకాశాలు వస్తున్నదేమో 40 ఏళ్లు దాటిన హీరోల సరసన అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు భోగట్టా.

షారుక్ ఖాన్(44 ఏళ్లు), అక్షయ్ కుమార్ (42 ఏళ్లు) వంటివారితో ఎంతదాకా నటించాలి..? అని దీపిక తెగ బాధపడిపోతోందట. ఇందులో భాగంగానే దక్షిణాదివైపు దృష్టి సారించినట్లు బాలీవుడ్‌లో కొంతమంది సినీజనాల సమాచారం.

అనుకున్నదే తడవుగా జయంత్‌ సి. ఫర్జానీ రూపొందిస్తున్న 'లవ్‌ ఫర్‌ ఎవర్‌' అనే చిత్రంలో కుర్రాళ్లతో కలిసి ఒక పాటలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఈ పాటతో టాలీవుడ్‌‍లో తన ఇమేజ్ చుక్కల్లోకి వెళితే, తెలుగులో సినిమాలు చేసేందుకు "సై" అనే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే అన్నట్లు.. పాట ఒకటే అయినా... ఆ కాస్త సేపటికే దీపిక వీలైనన్ని పొదుపు దుస్తులు ధరించింది. ఈతకొలనులో ఈదింది. టూ పీస్ వస్త్రాలలో కనిపించింది. మరి మన తెలుగు సినీ ప్రేమికులు దీపిక హాట్‌సాంగ్‌ను చూసి "రా.. రా... రమ్మంటారో..? పో.. పో.. పొమ్మంటారో..?" వేచి చూడాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT