1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Anubhav Anand

Nandana Sen | Anubhav Anand | Kiss | Romantic kiss | కొత్త హీరోకి నందనాసేన్ గాఢ చుంబనలు

నందనాసేన్
బాలీవుడ్ నటీమణి నందనాసేన్ నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో ఆమె సరసన అనుభవ్ ఆనంద్ అనే కొత్త హీరో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వీళ్లద్దరి మధ్య ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉన్నదట. ఆ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నానా తంటాలు పడ్డాడట.

కొత్త హీరో కావడం వల్ల నందనా పెదవులపై ముద్దెట్టుకోవడానికి అతగాడు తెగ సిగ్గుపడిపోయాడట. దీంతో నందనా చొరవ తీసుకుని అతని ముఖాన్ని దగ్గరకు లాక్కుని డైరెక్టరు కట్ చెప్పే వరకూ రెండు పెదవులపై గాఢమైన చుంబనలిచ్చిందట. దీంతో ఆ కుర్ర హీరో ముద్దు మస్తుతో చిత్తై ఎక్కడ చూసినా నందనా ముద్దు జపం చేస్తున్నాడట.

ఏ ఫంక్షన్‌కెళ్లినా నందనా చాలా గొప్ప నటి అనీ, జూనియర్ నటులనే తేడా లేకుండా అన్ని విషయాలను చాలా చక్కగా నేర్పుతుందని చెప్పడంతోపాటు పనిలో పనిగా ఘాటైన ముద్దు సంగతిని కూడా చెప్పేస్తున్నాడట.

తొలుత నందనా తన ముద్దు సంగతిని కొత్త హీరో ప్రచారం చేస్తున్నాడన్న సంగతిని తెలుసుకుని ముచ్చటపడినప్పటికీ, ఆ తర్వాత మోతాదు మించిపోవడంతో అతడిని పిలిచి... "నీ ముద్దు లొల్లి ఆపవయ్యా బాబూ.." అని చెప్పిందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT