1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Mallanna

Shreya| Mallanna| Vikram| Exposing| Istam| NayanTara| Anushka | "ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిందే..!": శ్రి.య

శ్రియ
"ఇష్టం" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్రియ... తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటించే మల్లన్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమాలో శ్రియ హాట్ హాట్ సీన్‌లలో నటిస్తోన్నట్లు సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే...తెరపై కన్పించే శ్రియ వేరు. నిజ జీవితంలో శ్రియ వేరు. తెరపై కన్పించే శ్రియ తనకు ఏమాత్రం నచ్చదని నటి శ్రియ తేల్చి చెబుతోంది. 'ఒకటి కావాలంటే మరొకటి వదులు కోవాల్సిందే' అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటోంది. అయితే మరో విషయం.. ఇంతవరకు తాను ఆశపడ్డపాత్ర రాలేదని, దానికోసమే ఎదురుచూస్తున్నానంటోంది.

ఫుల్‌డాన్స్‌ తరహా పాత్ర చేయాలనుందని శ్రియ చెబుతుంది. గతంలో కంటే ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువచేస్తున్నారనే ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందిస్తోంది. అది తన తప్పుకాదు. తన దగ్గరకు వచ్చే పాత్రల తీరు అలా ఉంటోంది.

గతంలో వచ్చిన పాత్రలకు అది అక్కర్లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు చేస్తున్న పాత్రలకు తప్పనిసరై ఉండవచ్చు. తెరపై కనిపించే శ్రియ. తనకు నచ్చినట్లుకాదు. దర్శకుడికి నచ్చినట్లు, పాత్ర అవసరమైన రీతిలో మాత్రమే ఎక్స్‌పోజింగ్ కన్పిస్తుంది.

ఇదిలా ఉంటే.. మల్లన్న చిత్రంలో శ్రియ బాత్‌టబ్ సీన్‌లలో రెచ్చిపోయి నటించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. విక్రమ్ సరసన "మల్లన్న" చిత్రంలో నటిస్తున్న శ్రియ ఈ చిత్రం ద్వారా నయనతార, అనుష్కలను దాటి ముందుకు తనే నెంబర్ వన్ అనే ఇమేజ్‌ను సంపాదించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి మల్లన్న చిత్రం శ్రియకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M