1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Gay sex

Celina Jaitly | Gay sex | Bollywood | mystery man | childhood | సెలీనాకు స్వలింగ సంపర్కులపై ఎందుకంత ప్రేమంటే...?

సెలీనా జైట్లీ
ఢిల్లీ హైకోర్టు గే సేక్స్ చట్టబద్ధమే అన్నప్పుడు ముంబయి వీధుల్లో కేరింతలు కొడుతూ సరదా చేసిన సెలీనాకు స్వలింగ సంపర్కులంటే ఎందుకు అంత ప్రేమో తెలిసిపోయిందంటున్నారు బాలీవుడ్ జనం. ఈమధ్య ముంబయిలో సెలీనా ఓ పార్టీకి ఓ అపరిచితుడిని వెంటబెట్టుకు వచ్చిందట.

కారు దిగి అతడి చేతిలో చేయివేసి నడిచి వస్తూ దాదాపు అతడిని పెనవేసుకుపోయినట్లుగా అక్కడికి వచ్చిందట. సెలీనా వెంట ప్రత్యక్షమైన ఆ అపరిచితుడు ఎవర్రా...? అని అక్కడున్నవారంతా తేరిపార చూస్తే.. అతనో స్వలింగ సంపర్కుడని తేలిందట. అంతే... అందరూ నిర్ఘాంతపోయారట. అయితే సెలీనాకు బాగా సన్నిహితులైనవారు మాత్రం అతగాడు చిన్నతనంలో సెలీనా ఫ్రెండ్ ఇందుమతి అని తేల్చిపారేశారట. పనిలో పనిగా అతనో "గే గై" అని కూడా చెప్పారట.

ఆ పార్టీలో ఎవరు ఎన్నిరకాలుగా అనుకుంటున్నా సెలీనా + గే గై మాత్రం తమదైన లోకంలో చాలాసేపు గడిపేశారట. దీనిపై సెలీనాను కదిలిస్తే... పకా పకా విరగబడి నవ్విందట. ప్రశ్నకు జవాబు చెప్పే ముందు కనీసం ఓ అరగంటపాటు ఆపకుండా నవ్వీ నవ్వీ ఇలా చెప్పిందట.

తను ఇలాంటి వాటిని ముందే ఊహించాననీ, అసలు ఇటువంటి లింకులు గురించి పట్టించుకోననీ, తనేకాదు తన కుటుంబం కూడా ఇటువంటి వదంతులను కూర ఆకులో పురుగును తీసి పడేసినట్లు పడేస్తారని అందట. అసలు సినిమాలు చేయడానికే తీరిక లేక పోతుంటే, ఇటువంటి ప్రేమయాణాలు సాగించడానికి టైమెక్కడదీ అందట. మరి పార్టీతో మీతో కలసి వచ్చిన ఆ అపరిచిత వ్యక్తి ఎవరూ అని రెట్టిస్తే... మీరు చూశారా...? అని కళ్లు మిటకరిస్తూ ఎదురు ప్రశ్న వేసిందట. మరీ అలా నిలదీస్తే... ఎవరైనా ఏం మాట్లాడతారూ..?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT