1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Dhoni

Lakhmi Rai | Dhoni | Long hair | beauty | Girl friend | పొడవైన జులపాల జుట్టులోనే ధోనీ ఎంతో అందంగా ఉంటాడట

ధోనీ
ధోనీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందే చెప్పి విసుగెత్తిస్తున్న తమిళనటి లక్ష్మీరాయ్ కొత్తగా ధోనీ గురించి మరో మాట మాట్లాడిందట. పొడవైన జులపాల జుట్టులోనే ధోనీ ఎంతో అందంగా ఉంటాడని పరవశించిపోతూ చెప్పిందట. ఆ జుట్టును చూస్తూ అలా కాలం గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయట.

అదిసరే... "ధోనీ గురించి తెగ చెపుతున్నావ్.. ఇటీవల ధోనీని ఎప్పుడైనా కలిశావా..?" అని ఎవరైనా అడిగితే, చివాల్న చూసి, ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తారో... ఎప్పుడు మాట్లాడుకుంటారో వాళ్లకే తెలుసు. నేను ధోనీని ఎప్పుడు కలిశానో ధోనికే తెలుసు- అని తికమక జవాబులు చెపుతోందట.

లక్ష్మీరాయ్ సమాధానాలను అలా ఉంచితే, పదేపదే ధోనీ గురించి "రాయ్" మాట్లాడటం చూసి ధోనీ నిజంగానే జూలు పెంచుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒకవేళ ధోనీ జులపాల జుట్టుతో మళ్లీ మనకు కనబడితే, లక్ష్మీరాయ్ ప్రభావం ధోనీపై ఉన్నట్లు మనం లెక్క వేసుకోవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT