1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. "మీరాజాస్మిన్‌"కు మాండలిన్ రాజేష్ ''టాటా'' చెప్పేశాడా..!?

Meera Jasmine, Mandolin Rajesh, Love, Badra, Akasaramanna | "మీరాజాస్మిన్‌"కు మాండలిన్ రాజేష్ ''టాటా'' చెప్పేశాడా..!?

వెండితెర
FileWD
"భద్ర" సినిమా హిట్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. ఆ తర్వాత గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది, మా ఆయన చంటిపిల్లాడు, గోరింటాకు వంటి చిత్రాల్లో అద్భుత నటనను ప్రదర్శించిన ఈ భామకు తదనంతరం టాలీవుడ్ ఆఫర్లు వెల్లువల్లా వచ్చాయి.

తాజాగా అ,ఆ, ఇ, ఈ, బంగారు బాబు, ఆకాశరామన్న వంటి సినిమాల్లో నటిస్తోన్న మీరాజాస్మిన్‌కు ప్రేమ వ్యవహారం అంతగా కలిసిరాలేదని సినీ పండితులు అంటున్నారు.

గత కొంతకాలంగా మీరాజాస్మిన్‌కి, మ్యూజీషియన్ మాండిలిన్‌ రాజేష్‌కి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్లికూడా చేసేసుకున్నారని సినీ జనం అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో.. మీరాజాస్మిన్‌కి మాండలిన్‌ రాజేష్‌ టాటా చెప్పేశాడనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుప్పమన్నాయి. ఎవరైనా ఈ విషయమై మాండలిన్ రాజేష్‌ను వివరాలడిగితే.. మీరాతో ప్రేమాయణం ముగిసిన పోయిన అధ్యాయం అని చెపుతున్నాడట. మరి వీరి ప్రేమాయణం ముగిసినట్లేనా? లేదా కొనసాగుతుందా..? అనే విషయం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!.
About Writer
SELVI.M