1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ram Gopal Varma

Priyanka Kothari | Ram Gopal Varma | Adavi | beach songs | Hot actress | ప్రియాంకా... మళ్లీ అడవికెళ్దాం పద: రామ్‌గోపాల్ వర్మ

రామ్గోపాల్ వర్మ
రామ్‌గోపాల్ వర్మ ఏ చిత్రం చేసినా ఆయన టేకింగ్, థింకింగ్.. అంతా డిఫరెంట్. ఆయన తాజాగా రూపొందిస్తున్న "అడవి"లో ప్రియాంకా కొఠారి అరణ్యంలోని ముళ్ల తుప్పల మధ్య మహా గరం గరంగా కనబడుతుంది. ఇదంతా బాగానే ఉంది... కానీ ప్రియాంక మాత్రం ఆ అడవికి వెళ్లొచ్చిన తర్వాత శరీరమంతా చీరుకుపోయి గాయాలతో మూలుగుతోందట.

తన సున్నితమైన శరీరాన్ని అడవిలోని సూదంటు ఆకులు, మొనదేలిన ముళ్లు గుచ్చుకుని ఆమెకు చెప్పలేనంత నొప్పి పెడుతున్నాయట. ఆమె ఇలా బాధపడుతుంటే.. రామ్‌గోపాల్ వర్మ మళ్లీ అదే అడవిలోకి మరోసారి పాటల చిత్రీకరణ కోసం వెళ్లాలని ప్రియాంకతో చెప్పాడట.

అంతే కొఠారి "కుయ్యో"మని పెద్దగా మూలుగుతూ... నేను రాను "మొర్రో" అందట. నటించిన సన్నివేశాలకు పాటలు ఖచ్చితంగా అతుక్కుపోవాలంటే, అడవిలోకి వెళ్లాల్సిందే అని వర్మ గట్టిగా చెప్పటంతో కొఠారి తన గాయాలను రాముకు చూపిందట. దాంతో మెత్తబడిన వర్మ, సరే లోకల్ బీచ్‌లో పాటలను కానించేద్దాం అని సముదాయించాడట.

పాపం.. కొఠారిని "అడవి" ఎంత పనిచేసింది. అన్నట్లు మన నితిన్ వళ్లు ఎలా ఉందో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT