Nadodigal| Krishna Vamsi| Surender Reddy| Allari Naresh| Priyamani| Lakshmi Rai | కృష్ణవంశీ ఔట్.. సురేందర్‌రెడ్డి ఇన్..!
"
అనంతపురం 1980" ఫేమ్ శశికుమార్ నటించిన తాజా తమిళ చిత్రం "నాడోడిగళ్" తెలుగు హక్కులను ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ సురేందర్ రెడ్డి పొందారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను అద్భుతంగా రూపొందించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.ఇంకా "నాడోడిగళ్" మల్టీస్టారర్ సినిమా కాబట్టి తెలుగులో రవితేజ, అల్లరి నరేష్‌తోపాటు మరో నటుడిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపికచేయనున్నట్లు సమాచారం. లేదంటే.. లక్ష్మీరాయ్ కూడా అనుకుంటున్నారు.
తమిళ నాడోడిగళ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రకనిని తెలుగు రీమేక్ దర్శకత్వ పగ్గాలు అందించాలని మొదట అనుకున్నారు. తర్వాత కృష్ణవంశీతో చేయాలని సంప్రదింపులు జరిపారు. స్నేహం విలువపై రూపొందే చిత్రం కావడంతో కృష్ణవంశీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం 'కిక్' దర్శకుడు సురేందర్‌రెడ్డిని ఈ సినిమా దర్శకత్వ సారథిగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.